ఏపీలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్.. రెండు చోట్లా పోటీకి కీలక నేతలు రెడీ
నేను తెలుగు భాష లెక్క. ఆడా ఉంటా..ఈడా ఉంటా అంటున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. రెండు చోట్ల పోటీకి చంద్రబాబు, జనసేనాని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి తన సిటింగ్ స్థానం కుప్పంతో పాటు.. విశాఖపట్నంలోని భీమిలిలో కూడా చంద్రబాబు పోటీ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటు పవన్ కల్యాణ్ కూడా గతంలో లాగా.. ఈసారి కూడా రెండు చోట్లా పోటీకి ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఓడిపోయిన తన సొంత గడ్డ భీమవరం నుంచి మరోసారి సమరానికి సై అంటున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఈ సారి భీమవరంలో గెలిచి సత్తా చాటాలని, విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని చూస్తున్నారట. గతంలో ఓఢిన సింతపి వర్కౌట్ అవుతుందని చూస్తున్నారట పవన్. ఇక మరో స్థానం తిరుపతిలో పోటీకి రెడీ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. గత ప్రజారాజ్యం సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచిన సీటును ఎంచుకోబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు, పవన్ రెండు చోట్లా పోటి చేస్తుండగా.. లోకేష్, బాలకృష్ణ ఈ సారి తమ నియోజకవర్గాలను ఛేంజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అల్లుడు లోకేష్ కోసం మామ బాలకృష్ణ తన హిందూపురం సీటును త్యాగం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హిందూపురం.. టీడీపీకి కంచుకోట లాంటి స్థానం. గతంలో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. బాలకృష్ణ కూడా 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఇక్కడ నందమూరి అభిమానులతో పాటు టీడీపీ బలంగా ఉండడంతో..ఈసారి లోకేష్‌ను ఇక్కడి నుంచి పోయిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధిష్టానం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా లోకేష్‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్టించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ ఈ సారి హిందూపురం కాదని, గుడివాడ నుంచి పోటీకి సై అనబోతున్నారట. వైసీపీ కీలక నేతగా ఉన్న.. కొడాలి నానితో బాలయ్య తలపడబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఐతే చంద్రబాబు ఈ సారి రెండు చోట్లా పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో..ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ పెరుగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డి.. కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. గత ఎన్నికల్లో సీమలో ఎంత వైసీపీ గాలి వీచినా కుప్పం స్థానాన్ని నిలుపుకున్నారు బాబు. ఈసారి అక్కడ చంద్రబాబు గెలుపు ఖాయం అంటున్నారు టీడీపీ శ్రేణలు. ఏదేమైనా చంద్రబాబు సేఫ్ సైడ్‌గా కుప్పంతో పాటు.. ఉత్తరాంధ్రలో మరో కీలక స్థానం భీమిలిని ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. భీమిలీ టీడీపికి కంచుకోట. ఉత్తరాంధ్రలో ఒక స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికే చంద్రబాబు…ఈ సారి రెండు స్థానాలను ఎంచుకోనున్నారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇక గతంలో పవన్ గాజువాక, భీమవరంలో పోటీ చేసి..రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఈసారి గాజువాకను కాదని.. తిరుపతికి షిఫ్ట్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి..ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో అన్న సెంటిమెంట్ తనకు కూడా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో పవన్..తిరుపతిలో పోటీకి సిద్ధం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గతంలో ఓడిన సింపతి వర్కౌట్ అవుతుందని మరోసారి భీమవారన్నే నమ్ముకోబోతున్నారట పవన్. ఇలా ఈసారి వైసీపీని ఓడించి.. అధికారం చేపట్టాలనే వ్యూహంతో పావులు కదుపుతోంది టీడీపీ- జనసేన కూటమి.